మా హోటల్‌లో భోజనం ఫ్రీ


ఆహారం కొనుక్కోలేనివారికి మా హోటల్‌లో భోజనం ఉచితం

Dubai restaurant
Dubai restaurant


దుబాయ్‌ : దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఈ సిద్ధంతాన్ని నమ్ముతు దుబాయ్‌లో హోటల్ వ్యాపారాన్ని నడుపుతున్న ఫాదీ అయ్యద్(39) ఇదే మార్గాన్ని అనుసరిస్తూ ఎంతో మంది కడుపు నింపుతున్నారు. దుబాయ్‌లో ఫౌల్ డబ్ల్యూ హమ్మస్ అనే అరబిక్ రెస్టారెంట్ నడుపుతున్న ఫాదీ తన రెస్టారెంట్ బయట పెద్ద బ్యానర్‌ను తగిలించారు. అందులో ఏమని రాసి ఉంటుందంటే.. ఖఆహారం కొనుక్కోలేనివారికి మా హోటల్‌లో భోజనం ఉచితం. ఇది అల్లా ఇస్తున్న బహుమతిగ అని రాసి ఉంటుంది. అంటే ఎవరైనా తినడానికి డబ్బుల్లేక ఆకలితో బాధపడుతుంటే వారికి ఈ హోటల్‌లో భోజనం ఫ్రీ అన్నమాట.
ఇలా నిత్యం తాము 30 నుంచి 40 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నామని ఫాదీ చెబుతున్నారు. డబ్బులు కోసమే వ్యాపారాన్ని నడుపుతున్నామని.. అయితే తనకు వచ్చే దాంట్లోనే ఎంతో కొంత ఈ విధంగా సహాయం చేయాలని నిశ్చయించుకున్నానని ఫాదీ తెలిపారు. తమ హోటల్లో సాండ్ విచ్ నుంచి బీఫ్ వరకు.. టీ నుంచి కూల్‌డ్రింక్ వరకు అనేక ఐటమ్స్ ఉంటాయన్నారు. డబ్బులు లేని వారు వారికి నచ్చిన ఏ ఐటమ్ అయినా ఉచితంగా తినచ్చని చెప్పారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/