భారతీయ చిన్నారులు, వయో వృద్ధులకు అమెరికా శుభవార్త

Visa
Visa

వాషింగ్టన్‌: అమెరికా వీసా ఆశిస్తున్న భారతీయ చిన్నారులు, వయో వృద్ధులకు శుభవార్త. సెప్టెంబరు 1 నుంచి జరగనున్న వీసా ఇంటర్వ్యూలో 14 ఏళ్లలోపు బాలలు, 79 ఏళ్లకు మించి వయసున్న వారికి మినహాయిపునిచ్చింది. కొత్త దరఖాస్తులతోపాటు, రెన్యూవల్స్‌కూ ఇది వర్తిస్తుందంటూ ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌కు భారత్‌లోని అమెరికా కాన్సులేట్‌ పంపిన ఈ మెయిల్‌లో పేర్కొంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పైన పేర్కొన్న వయసువారికి వీసా ఇంటర్వ్యూ ఉంటుందని వివరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/