ఇరాక్‌లో భద్రతా దళాల కాల్పులు.. గాయపడ్డిన వందలాది మంది

Iraqi security forces firing
Iraqi security forces firing

బాగ్దాద్ : ఇరాక్‌లో ప్రభుత్వ వర్గాల్లో అవినీతి, లంచగొండితనం, ప్రజాసర్వీసుల లోపం, విద్యు త్ సరఫరాల్లో అస్తవ్యస్తం, ఆర్థికమాంద్యం, నిరుద్యోగం తదితర సమస్యలపై గత కొన్ని నెలలుగా సాగుతున్న ఆందోళనలు రానురాను హింసాత్మకం అవుతున్నాయి. ఇరాక్‌లోని షియాతే పవిత్ర స్థలం కర్బాలాలో మంగళవారం భద్రతా దళాలు 18 మంది ఆందోళనకారులను మట్టుబెట్టాయి. వందలాది మంది గాయపడ్డారని అధికార వర్గాలు చెప్పాయి. ఇరాకీలు వీధుల్లో చేరి ఆందోళనలు ఉద్ధృతం చేయడంతో రాత్రికిరాత్రి భద్రతాదళాలు వారిని అరికట్టడానికి కాల్పులు జరిపారు. ఎలాంటి నాయకత్వం లేకుండా స్వచ్ఛందంగా ఆందోళనలు చేపట్టడంతో మొదటి రోజు నుంచి తుపాకీ కాల్పులు, భాష్పవాయువు ప్రయోగాలు ఆందోళనకారులకు ఎదురవుతున్నాయి. శుక్రవారం నుంచి ఉధ్ధృతమైన ఆందోళనల్లో దాదాపు 72 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. వీరుకాక ఈ నెల మొ దట్లో 149 మంది ఆందోళన కారులు మృతి చెందారు.

కర్బాలాలో సుమారు 800 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ వర్గాలు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం ఆరుగంటల వరకు కర్ఫూ విధించారు. సోమవారం వేలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందారు. వందకు పైగా గాయపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/