పాక్ అందించిన సహకారం చాలా గొప్పది

trump and imran khan
trump and imran khan

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతు తాము తలచుకుంటే ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని వారం రోజుల్లో ముగించేయగలమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రపంచపటం నుంచి ఆ దేశం కనుమరుగవుతుందని చెప్పారు. కోటి మంది ప్రాణాలు పోకూడదని తాము భావిస్తున్నామని తెలిపారు. 1990లలో తాలిబాన్లకు పాకిస్థాన్ పూర్తిగా సహకరించింది. పాక్ సహకారంతో ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించారు. 2001లో అమెరికా సహకారంతో తాలిబాన్ల అరాచక పాలన అంతమైంది. అప్పటి నుంచి తాలిబాన్లకు అమెరికా నేతృత్వంలోని బలగాలకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ లో గత రెండు వారాల్లో ఎంతో పురోగతి సాధించామని… దీనికి పాక్ అందించిన సహకారం చాలా గొప్పదని కితాబిచ్చారు. అమెరికాకు అనుకూలంగా ఎన్నో జరుగుతున్నాయని… మీ నాయకత్వంలో పాకిస్థాన్ కు కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నానని ఇమ్రాన్ తో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/