రక్తసిక్తమైన కాబూల్‌

గురుద్వారా పై దాడి.. 11 మంది మృతి

afganistan
afganistan

కాబూల్‌: ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడుతున్న ఈ సమయంలో అఫ్గానిస్తాన్‌ రాజధాని రక్తసిక్తమైంది, ఈ రోజు ఉదయం 7.45 నిమిషాలకు ఇక్కడి షోర్‌ బజారులోని గురుద్వారా లో సుమారు 150 మంది ప్రార్థన చేస్తుండగా.. ఆయుధాలు, బాంబులు ధరించిన కొందరు ముష్కరులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే మరణించగా.. మరికొంత మంది గాయపడ్డారు. దీనికి తమదే భాద్యత అంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ప్రకటించుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. దాడి జరిగిన నేపథ్యంలో అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కుల రక్షణకు అవసరమైన సాయాన్ని అందించేందుకు భారత్‌ సిద్దంగా ఉందని విదేశాంగ శాఖ ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/