7 టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌లను సిద్ధం చేసిన పాకిస్థాన్‌!

terrorist ready
terrorist ready


న్యూఢిల్లీ1: వాస్తవాధీన రేఖ వెంబడి 7 టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌లను సిద్ధం చేసిన పాకిస్థాన్‌, అందులో చొరబాటుకు సిద్ధంగా 275 మందిని ఉంచినట్లుగా తెలుస్తోంది. అందులో ఆఫ్ఘనిస్తాన్‌, పుష్తున్‌కు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరు ఏ క్షణమైనా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇండియాలో, ముఖ్యంగా కాశ్మీర్‌ లోయలో అశాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పాక్‌ ప్రణాళికలు రూపొందిస్తోందని, అందులో భాగంగా ఐఎస్‌ఐ ఇటీవల ఉగ్రవాద సంస్థలతో ప్రత్యేకంగా చర్చలు సాగించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు, సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్‌ ప్రాంతం ద్వారా చొరబాటుకు యత్నిస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/