భారత్‌పై పాక్‌ దాడికి కుట్ర!

terrorist
terrorist


శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్‌ భారత్‌పై రగిలిపోతున్నది. భారత్‌లో మళ్లీ పుల్వామా ఉగ్రదాడి తరహా దాడి చేసేందుకు పాకిస్థాన్‌ సిద్ధమవుతన్నది. నియంత్రణ రేఖ వద్దకు పాకిస్థాన్‌ పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తుండడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. భారత్‌లో చొరబడేందుకు నియంత్రణ రేఖ సమీపంలో కాచుకొని కూర్చున్న ఉగ్ర శిబిరాల వద్దకు ఇవి చేరుతున్నాయని నేషనల్‌ మీడియా తెలిపింది. దాదాపు 60మంది ముష్కరులు పివొకేలోని దూద్‌గా§్‌ు, దుర్మాత్‌, లోసర్‌, తౌబాట్‌లోని ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నారని, వీరు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. కాశ్మీర్‌లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోన్న పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఇంటర సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ దాదాపు పదివేల మంది ఉగ్రవాదులను అఫ్గాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఖైబర్‌ పక్తుంఖ్వా ప్రావిన్స్‌ నుండి నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/