అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

road accident
road accident

అమెరికా: అమెరికాలో తెలుగు విద్యార్థి పత్తిపాటి వివేక్ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియం గంగనపల్లికి చెందిన వివేక్ గత శుక్రవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమెరికాలోని షార్లెట్, నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్సిటీలో వివేక్ ఎమ్‌ఎస్ చదువుతున్నాడు. వివేక్ చదువుకుంటూ షార్లెట్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. గత శుక్రవారం విధులు మిగించుకుని ఇంటికి వెళుతుండగా అతడిని ఓ ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. అయితే వివేక్ తండ్రి పి.ఉమాపతి నాయుడు బెంగుళూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.కాగా వివేక్‌ మృతదేహంఅక్కడ నుంచి ఇండియాకు రావడానికి 4 రోజులు పట్టనుంది.


తాజా జాతీయ యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/