లండన్‌లో ”టాక్‌ బోనాల జాతర”

Shri. Jay Reddy
Shri. Jay Reddy

లండన్‌: లండన్‌లో తెలంగాణ అసోసియేషన్‌ అఫ్‌ యునైటెడ్‌ కింగ్డమ్‌(టాక్‌) ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 800కి పైగా ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టుగానే సంప్రదాయ బద్దంగా పూజలను నిర్వహించారు. లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు.. ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా ముగ్దులను చేసింది. టాక్ ఎన్నో సంవత్సరాలుగా లండన్‌లో బోనాలు జరుపుతున్నప్పటికీ.. మొట్టమొదటిసారిగా పోతురాజు బోనాలు ఊరేగింపును నిర్వహించడంతో ప్రవాసీయుల నుంచి సంస్థ ప్రశంసలందుకుంది. పోతురాజు వేషధారణను ధరించిన శ్రీ. జయ్ రెడ్డి గారు ప్రత్యేకించి అమెరికా నుంచి లండన్ రావడంతో ఆయనను ప్రవాసులే కాక కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సైతం ప్రశంసించి సత్కరించారు.ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్‌జీత్, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/