భారత్‌తో తైవాన్‌ స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందం!

సుంకాలు, రిజిస్ట్రేషన్‌ జాప్యం తగ్గించాలని సూచనలు

bilateral investment agreement
bilateral investment agreement

న్యూడిల్లీ: ద్వైపాక్షిక పెట్టుబడులప్రోత్సాహక ఒప్పందం గత ఏడాది సంతకాలు జరిగిన తర్వాత ఇపుడు భారత్‌తో స్వేఛ్ఛాయుత వాణిజ్య ఒప్పందంకోసం తైవాన్‌ విస్తృత కసరత్తులుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచే సంప్రదింపులుప్రారంభించింది. తైవాన్‌ విదేశీ వాణిజ్య అభివృద్ధి మండలి (తైత్రా)ఛైర్మన్‌జేమ్స్‌ సిఎప్‌ హువాంగ్‌ తైవాన్‌ ఎక్స్‌పోప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ స్పష్టంచేసారు. చైనాతో విభేదాలులేకుండా తైఆవాన్‌ పెట్టుబడులను రాబట్టుకోవాలని భారత్‌ కృషిచేస్తోంది. తైపేయి కేంద్రంగా ఉన్న ప్రభుత్వాన్ని గడచిన 70 ఏళ్లుగా చైనా స్వతంత్ర దేశంగా గుర్తించని అంశం తెలిసిందే. ఇపుడు పరిస్థితులు మారాయి. వాణిజ్య సంప్రదింపులు సజావుగా సాగుతున్నట్లు ఆదేశ అధికారులు వెల్లడించారు. రాజకీయ పరంగా ఎప్‌టిఎలను సాధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ ఉత్పత్తులుమంచి నాణ్యతతోను, గట్టిపోటీ ఇచ్చే సత్తా ఉన్నప్పటికీ ఎక్కువ దిగుమతి సుంకాలను చెల్లించాల్సి వస్తోందని తైత్రా సిఇఒ ఎంఎస్‌ యే వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కువశాతం దేశాల్లో తైవాన్‌ ఉత్పత్తులపై అధికసుంకాలు విదిస్తున్నారని వెల్లడించారు. అయితే తమ దేశం వ్యూహాత్మకంగా వివిధ దేశాలతో వాణిజ్యభాగస్వామ్యాలను ఏర్పాటుచేసుకుంటున్నదని, ప్రస్తుతంఏడు స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందాలతో మూడు ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుఉన్నట్లు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/