పేలిన తాల్ అగ్ని పర్వతం

Taal Volcano
Taal Volcano

మనీలా : ఫిలిప్పీన్స్‌ దేశంలోని తాల్ అగ్నిపర్వతం సోమవారం పేలి లావా వెదజల్లింది. తాల్ అగ్నిపర్వతం పేలుడు ధాటికి లావా ప్రవహించడంతో 8వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం పేలుడుతో వెదజల్లిన లావా, పొగ వల్ల ఫిలిప్ఫీన్స్ దేశంలో సోమవారం 286 విమానాల రాకపోకలను రద్దు చేశారు. అగ్నిపరత్వం పేలుడు వల్ల వ్యవసాయ భూములు, భవనాలు దెబ్బతిన్నాయి. మనీలా నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లావా వల్ల దుమ్ముధూళి వ్యాపించడంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/