సిమ్లా ఒప్పందం ప్రకారం చర్చలు జరగాలి

Alice Wells
Alice Wells

వాషింగ్టన్‌: సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌పాకిస్థాన్‌ మధ్య నేరుగా చర్చలు జరిగితే ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించవచ్చని అమెరికా సూచించింది. ఇరు దేశాలమధ్య చర్చలు జరిగేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో.. ఇరు దేశాధినేతలతో మాట్లాడారని అమెరికాదక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ అన్నారు. పాక్‌ నుంచి కాశ్మీర్‌లో హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులు తమ దేశానికి కూడా శత్రువులేనని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను అమెరికా స్వాగతిస్తోందని అలైస్‌ వెల్స్‌ చెప్పారు. వాస్తవాధీనరేఖ వద్ద హింసకు పాల్పడుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌వంటి ఉగ్రవాద సంస్థల చర్యలకు పాక్‌ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ఉగ్రవాదుల చర్యలను పాక్‌ నిరోధించడం పైనే భారత్‌పాకిస్థాన్‌ మధ్య చర్చలు జరిగే పరిస్థితులకు మార్గం సుగమం అయ్యే అంశం ఆధారపడి ఉంటుందని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/