ఫైనల్‌కు భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు!

గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌

sundar pichai
sundar pichai

వాషింగ్టన్‌: ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌ జట్లు ఫైనల్‌కు వెళ్లాయని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయపడ్డారు. ఆ మ్యాచులో మెన్‌ ఇన్‌ బ్లూ( భారత జట్టు) విజయం సాధిస్తుందని అంచనా వేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా క్రికెట్‌ గురించి మాట్లాడారు. తనను తాను ఓ క్రికెట్‌ అభిమానిగా అభివర్ణించుకున్నారు. ప్రపంచకప్‌ తుది పోరు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్యే ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా చాలా సమర్ధవంతమైన జట్లు అని వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/