అక్కడ సోషల్‌ మీడియాపై తాత్కాలిక నిషేధం

Sri Lanka blocks social media
Sri Lanka blocks social media

కొలంబో: శ్రీలంకలో ఏప్రిల్‌ 21న ఈస్టర్‌ ఈరోజు జరిగిన బాంబు దాడి వల్ల 257 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పరిస్థితుల దృష్ట్యా ముందుస్తు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను అక్కడి ప్రభుత్వం ఈరోజు తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన కారణంగా ఎటువంటి వదంతులు వ్యాప్తి చెందకుండా మరోసారి నేడు సోషల్‌ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, వైబర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్‌ల సేవలు శ్రీలంక వాసులకు మరికొన్ని రోజులు దూరం కానున్నాయి.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/