రష్యా యుద్ధ విమానాలపై దక్షిణ కొరియా కాల్పులు

South Korean Warplanes
South Korean Warplanes

సియోల్‌: రష్యాకు చెందిన రెండు టీయూ95 యుద్ధ విమానాలు ఈరోజు ఉదయం దక్షిణ కొరియా గగన తలంలోకి ప్రవేశించాయి. దీంతో దక్షిణ కొరియా వార్‌ప్లేన్స్ కాల్పులు జరిపాయి. తమ గగన తలంలోకి ప్రవేశిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నట్లుగా తీవ్రంగా కాల్పులు జరుపుతూ హెచ్చరికలు పంపాయి. రష్యాకు చెందిన యుద్ధ విమానం ఇలా దక్షిణ కొరియా గగన తలంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారని దక్షిణ కొరియా రక్షణ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/