మెక్సికో కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకం

mexican
mexican

మెక్సికో : మెక్సికో ప్రభుత్వం దేశీయ కార్మికులకు కొత్త సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. అధ్యక్షుడు ఆండ్రూస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రెడార్‌ (ఆమ్లో) సారధ్యంలో అధ్యక్ష భవనం నేషనల్‌ ప్యాలెస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ సమావేశానికి హాజరైన మెక్సికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ జనరల్‌ జో రోబ్లెడో మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పథకం ప్రస్తుతం 11 వేల మంది కార్మికులకు వర్తిస్తుందని, దేశీయ కార్మికులకు ఉద్దేశించినదే అయినప్పటికీ అన్ని రంగాల వారికీ వర్తించే ఈ పథకం ఆరోగ్యం, అంగవైకల్యం, రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ వంటి ప్రయోజనాలు ఎటువంటి ఆంక్షలు లేకుండా సమకూరుతాయని వివరించారు. గత ఏప్రిల్‌ నుండి అమలులో వున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ 40 ఏళ్లు పైబడి, సగటున 5 వేల పెసోల నెలసరి వేతనం అందుకుంటున్న దాదాపు 11,947 మంది ప్రయోజనం పొందుతున్నారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని ఆయన చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/