పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుడు..16మంది మృతి

bomb blast in Pakistan's Quetta
bomb blast in Pakistan’s Quetta

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ క్వెట్టాలోని హజార్‌గంజ్‌ సబ్జి మండిలో ఈరోజు ఉదయం 7:35 గంటల సమయంలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు శాంతి భద్రతలు నిర్వహించే అధికారి ఉన్నారు. మరో 8 మంది హజారా కమ్యూనిటీకి చెందినవారున్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కూరగాయాలలో బాంబులు దాచి పేలుళ్లకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. మండికి సమీపంలోని భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ పేలుళ్లను తీవ్రంగా ఖండించారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/