మోడీని కలిసిన ప్రవాస భారతీయులు

Sikh Deligates meets Modi
Sikh Deligates meets Modi

Washington: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలోని హ్యూస్టన్‌ సిటీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రవాస భారతీయులతో మోడీ భేటీ అయ్యారు. ప్రధానిని కశ్మీరీ పండిట్లు, సిక్కులు, బోహ్రా సామాజికవర్గ సభ్యులు కలిశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కాశ్మీరి పండిట్లు ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీరి పండిట్లు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. హ్యూస్టన్‌లో ఈరోజు జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మోడీ పాల్గొననున్నారు. హౌడీ మోడీ కార్యక్రమంలో 50వేల మంది ప్రవాసులు పాల్గొననున్నారు. అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. అలాగే భారత్‌-అమెరికా సంబంధాలపై ఈ సందర్భంగా ట్రంప్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.