తానా మహాసభల్లో రాంమాధవ్‌కు చేదు అనుభవం

Ram Madhav
Ram Madhav

అమెరికా: బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అమెరికాలోని వాషంగ్టన్‌ డీసీలో తానా మహాసభకు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ప్రసంగిస్తూ, ఇరు రాష్ట్రాల తెలుగువారంతా ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్టను ప్రధాని నరేంద్రమోడి పెంచారని, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని… అందుకే దేశ ప్రజలంతా ఆయనకు మరోసారి పట్టం కట్టారని చెప్పారు. తన ప్రసంగాన్ని రాంమాధవ్ కొనసాగిస్తుండగా… ప్రవాసాంధ్రులు అడ్డుతగిలారు. ఈలలు వేస్తూ, కేకలు వేస్తూ గందరగోళం సృష్టించారు. వేదిక నుంచి దిగిపోవాలని నినాదాలు చేశారు. దీంతో, రాంమాధవ్ నిశ్చేష్టులయ్యారు. తన ప్రసంగాన్ని తొందరగా ముగించేశారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/