అన్నింటి కంటే అతిముఖ్యకారణం చైనా-పాక్‌ కారిడార్‌

చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కూడా మసూద్‌ రక్షణకు కారణం

MASOOD
MASOOD

అందరూ సిపెక్‌ పాకిస్థాన్‌ గుండెకాయ అనుకుంటారు. కానీ, ఇది చైనాకు ఆక్సిజన్‌ అందిస్తుంది. ఇప్పటివరకు చైనాకు చమురు రవాణా చేయాలంటే అది భారత్‌ కనుసన్నల్లోని మార్గాల నుంచి జరగాల్సిందే. చైనాకు వెళ్లే చమురునౌకలను భారత్‌ అండమాన్‌ దీవుల వద్ద తన నావికాదళంతో అడ్డుకొనే అవకాశం ఉంది. ఇదే జరిగితే చైనా వృద్థిరేటు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతుంది. ఈ విషయం చైనాకు తెలుసు. అందుకే ఈ మార్గానికి ప్రత్నామ్నాయంగా జింగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాకిస్థాన్‌ గ్వార్‌ పోర్టు వరకు సిపెక్‌ పేరుతో కారిడార్‌ నిర్మాణం చేపట్టింది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే చమురు, గ్యాస్‌లను ఈ మార్గం నుంచి చైనాకు తరలించనుంది. ఇది అత్యంత సురక్షితమైన చౌక వ్యవహారం ఇక్కడే మసూద్‌ పాత్ర ఉంది. ఈ సిపెక్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వెళుతుంది. ఇక్కడ చైనా, పాక్‌ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సిపెక్‌ నిర్మాణాన్ని పాక్‌ ప్రజలు కూడా వ్యతిరేకి స్తున్నారు. పాక్‌లోని ఖైబర్‌ కనుమల్లోని మాన్‌షేహ్‌రా నుంచి కూడా సిపెక్‌ మార్గం వెళుతుంది. ఇక్కడికి అత్యంత సమీపంలోని బాలాకోట్‌ వద్ద కూడా చైనా భూములను తీసుకొంది. అంతేకాదు సిపెక్‌లో దాదాపు 10వేల మంది చైనీయులు పనిచేస్తున్నారు. దీంతోపాటు పలు కీలకమైన విద్యుత్తు ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. ఈ సమయంలో జైషే నిషేధానికి మద్దతు తెలిపితే ఆ సంస్థ సిపెక్‌పై దాడులు మొదలుపెట్టే అవకాశం ఉంది. దీంతో అసలుకే ఎసరువస్తుంది. ఇది దాదాపు 51 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టు.. అందుకే చైనా కిమ్మనకుండా జైషేకు మద్దతు ఇస్తోంది. ఇదీ మసూద్‌కు చైనా మద్దతు వెనుక అసలు కారణం.