జమ్ముకశ్మీర్‌ అంశంపై స్పందించిన బంగ్లాదేశ్‌

Bangladesh
Bangladesh

ఢాకా: జమ్ముకశ్మీర్‌ అంశంపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్‌ స్పందించింది. ఇది భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ”ఆర్టికల్ 370 రద్దును భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారంగా బంగ్లాదేశ్ పరిగణిస్తోంది” అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశం ప్రాంతీయ సుస్థిరత, శాంతిని నెలకొల్పుట, అన్ని దేశాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని దానిలో పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కశ్మీర్ అంశం గురించి బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు వివరించిన మరుసటి రోజే ఆ దేశం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కశ్మీర్ అంశంపై భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాలనుకుంటున్న పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ ప్రకటన గట్టి ఎదురు దెబ్బే. అంతేకాక పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఏ కోశానా మద్దతు లభించడం లేదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/