సౌదీ మహిళలకు ప్రయాణ స్వేచ్ఛ లభించింది

ఆంక్షలు ఎత్తివేసిన అరబ్‌ దేశం

 travel womens
travel womens

రియాద్‌: సౌదీ మహిళలకు ‘ప్రయాణ స్వేచ్ఛ’ లభించింది. ఎప్పటి నుంచి అమల్లో ఉన్న సంకెళ్లలాంటి ఓ చట్ట పరిమితికి అక్కడి ప్రభుత్వం చెల్లు చీటీ ఇచ్చేసింది. ఇకపై అక్కడి మహిళలు స్వేచ్ఛా విహంగాల్లా ఎగిరి పోయేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. సొంత నిర్ణయంతో పాస్‌పోర్టు తీసుకుని విదేశాలకు వెళ్లవచ్చు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం గార్డియన్‌ షిప్‌ చట్టంలో మార్పు చేసింది. గార్డియన్‌షిప్‌ చట్టాన్ని భరించలేక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు సౌదీ నుంచి పారిపోయి విదేశాల్లో ఆశ్రయం పొందారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మహిళ స్వేచ్ఛకు బంధనాలు వేసే దేశంలో సౌదీ అరేబియా ముందుంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆదేశంలో మహిళలపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అక్కడి గార్డియన్‌షిప్‌ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణం చేయాలన్న తండ్రి, భర్త లేదా సోదరుడి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.ఇకపై అటువంటి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. నిన్నటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/