ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ వాడకంపై నిఫేధం

face recognition technology
face recognition technology

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరం సంచలన నిర్ణయం తీసుకున్నది. టెక్నాలజీ విప్లవానికి కేంద్ర బిందువైన ఆ నగరం ఇప్పుడు ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ వాడకంపై నిషేధం విధించింది. ముఖ్యంగా ఈ ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు, ఇతర ఏజెన్సీలు వినియోగించరాదంటూ చట్టసభ ప్రతినిధులు తీర్మానించారు. వాస్తవానికి చిన్న, చిన్న నేరస్తులు, అనుమానితులను పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని వినియోగించాలంటే అనుమతి తీసుకోవాలని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రతినిధులు తేల్చారు. గత ఏడాది అన్నాపోలీస్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో అనుమానితులను గుర్తించేందుకు ఈ టెక్నాలజీని వాడారు. దీనిపై పౌరహక్కుల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిఘా వ్యవస్థ మితిమీరిపోతున్నదని పౌరనేతలు ఆరోపించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/