ఆస్ట్రేలియాలో భారత్ హై కమిషనర్ తో రోజా సమావేశం

  • ఏపీలో అభివృద్ధి పథకాల గురించి వివరించిన రోజా
Roja meets High Commissioner of India
Roja meets High Commissioner of India

ఆస్ట్రేలియా: ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రోజా తన పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఇండియన్ హై కమిషనర్ డాక్టర్ ఏఎం గొండనేతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాల గురించి వివరించిన రోజా, ఏపీలో పెట్టుబడుల అవకాశాల గురించీ వివరించారు. అభివృద్ధి పథకాల గురించి వివరించగా ఆయన ప్రశంసించినట్టు రోజా తన పోస్ట్ లో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/