అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై నివేదిక

robert mullar
robert mullar


హైదరాబాద్‌: 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న అంశంపై రాబర్ట్‌ ముల్లర్‌ చేపట్టిన విచారణ పూర్తి అయ్యింది. ఆ నివేదికను ఆయన సమర్పించారు. సుమారు రెండేళ్ల పాటు ముల్లర్‌ సుదీర్ఘ విచారణ చేపట్టారు. ట్రంప్‌ విక్టరీ కోసం రష్యా పనిచేస్తున్నట్లు ఆరొపణలు ఉన్నాయి. ముల్లర్‌ ఇచ్చిన రిపోర్టుతో ట్రంప్‌ను అభిశంసించే అవకాశాలు ఉన్నాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముల్లర్‌ ఇచ్చిన నివేదిక రహస్యమైందని అటార్నీ జనరల్‌ బిల్‌ బార్‌ తెలిపారు. ఐతే త్వరలోనే ఆ నివేదికలోని అంశాలను కాంగ్రెస్‌కు వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. రష్యాతో ట్రంప్‌కు లింకులున్నాయని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. వియత్నాం యుద్ధంలో పనిచేసిన ముల్లర్‌..గత రెండేళ్లు ఎన్నికల విచారణ కోసం చాలా తీవ్రంగా పనిచేశారు. ట్రంప్‌ ప్రభుత్వంలో పనిచేసిన ఆరుమందిని ఇప్పటికే వేరువేరు కారణాలతో తొలగించారు.