మరోసారి అమెరికాదీ అదే దారి

 Bank of America
Bank of America

వాషింగ్ట్టన్‌: రాబోయే 12 నెలల్లో అమెరికా మరోసారి మాంద్యం లోకి పడిపోయే ప్రమాదం కనిపిస్తోందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయంగా కూడా పరిణామాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. మాంద్యం వచ్చేందుకు 20 శాతం వరకు అవకాశాలున్నాయని.. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఇందుకు మూడోవంతు అవకాశాలు కూడా ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఆర్థికవేత్తల అధినేత మిషెల్‌ మెయిర్‌ హెచ్చరించారు. పారిశ్రామిక ఉత్పత్తులు, వాహనాల అమ్మకాలు, మొత్తం పనిగంటలు.. ఈ మూడు సూచికలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆమె తెలిపారు. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా ఇలాగే చెప్పింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/