హెచ్‌-4 వీసాదారులకు తాత్కాలిక ఊరట

visa
visa

వాషింగ్టన్‌: అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఊరట లభించింది. హెచ్‌4 వీసాదారులు అమెరికాలో పనిచేసుకొనేందుకు కొలంబియా సర్క్యూట్‌ కోర్టు అనుమతినిచ్చింది. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్‌4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్‌1బీ వీసా కలిగిన ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తూ, వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ విధానం భారతీయలకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులు రద్దు చేశారు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ కొలంబియా సర్క్యూట్స్‌లో దాఖలైన వ్యాజ్యాలను విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు త్రిసభ ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో తీసుకున్న నిర్ణయాన్ని పున పరిశీలించుకోవాలని దిగువ కోర్టులకు సూచించింది. దీంతో హెచ్‌4 వీసాదారులకు పని అనుమతులను పునరుద్ధరించినట్టయింది. అమెరికాలో 1.2 లక్షల మంది హెచ్‌4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/