ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అత్యవసరం

BRICS 2019
BRICS 2019

బ్రెజిల్‌: బ్రిక్స్‌ దేశాల 11వ శిఖరాగ్ర సదస్సు వేదికగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అత్యవసరమని కూటమి దేశాల నేతలు అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం బహుళ దేశాలకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారం, ప్రపంచ వ్యవహారాల్లో ఐరాసకు పాత్రకు మద్దతు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం ద్వారా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. ఐరాస, డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్‌ సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ‘బహుళ ధ్రువ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఈ సంస్కరణలు మరింత ప్రజాస్వామ్యయుతంగా, అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తూ.. అంతర్జాతీయ నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. మార్కెట్లకు మరింత అవకాశం కల్పించేవిగా ఉండాలి.” అని బ్రిక్స్‌ నేతలు ప్రకటించారు. న్యాయం, సమానత్వంతో కూడిన అవకాశం అందరికీ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని బ్రిక్స్‌ నేతలు పేర్కొన్నారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/