అంటార్కిటికాలో పెరిగిన వేడి

తొలిసారిగా 20.75 డిగ్రీల సెల్సియస్..అధ్యయనం చేస్తున్నామన్న శాస్త్రవేత్తలు

antarctica
antarctica

న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అంటార్కిటికా ఉత్తరాగ్రంలో ఉన్న సైమోర్ ద్వీపంలో తొలిసారిగా 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఖండంలో గత రికార్డు 19 డిగ్రీల సెల్సియస్ కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఇక, వాతావరణ మార్పుల కారణంగానే వేడిమి పెరిగిందని చెప్పలేమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, ఇక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/