వజ్రం లోపల మరో వజ్రం..

Diomond
Diomond

మాస్కో: వజ్రం ఎంతో విలువైనది. ఇది భూమిలో అరుదుగా దొరుకుతుంది. అయితే వజ్రం లోపల మరో వజ్రం ఉండటం ఎంత విచిత్రం. రష్యా.. సైబీరియాలోని ఒక గనిలో ఈ వజ్రం దొరికింది. ఆశ్చర్యమేమిటంటే ఒక వజ్రంలోపల మరో వజ్రముండటమే. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును మరి! పెద్ద వజ్రంలో ఉన్న చిన్న వజ్రం అటూ ఇటూ కదులుతున్నదని రష్యా స్టేట్‌ మైనింగ్‌ కంపెనీ అల్రోసా పిజెఎస్‌సి తెలిపింది. ఈ వజ్రం 80 కోట్ల సంవత్సరాల నాటిదని చెపుతున్నారు. దీని బరువు 0.62 కేరట్లు ఉందని, దీని లోపల ఉన్న వజ్రం బరువు 0.02 కేరట్లు ఉందని చెప్పారు. ఈ వజ్రం అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకూ కొన్ని వందల గనుల్లో వజ్రాల తవ్వకాలు జరిగాయి. దొరికొన ప్రతి డైమండ్‌ను రికార్డు చేశారు. ఇప్పటి వరకూ ఇలాంటిది కనిపించకపోవడం విశేషం. సాధారణ ఏ వజ్రమైనా లోపల్‌ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఖనిజం అందులో చేరి ఉంటుంది. ఈ డైమండ్‌ మ్తారం లోపల ఖాళీగా ఉంది.

అంతేగాక చిన్న వజ్రాన్ని తనలో దాచుకుంది. పెద్ద వజ్రాన్ని కదుపుతుంటూ చిన్న వజ్రం కూడా కదులుతోంది. ప్రస్తుతం ఈ డైమండ్‌ను రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ జియోలాజికల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థకు పరిశోధన కోసం ఇచ్చారు. సైంటిస్టులు దీన్ని స్పెక్ట్రోస్కోపీ, ఎక్స్‌రే మోక్రోటోమోగ్రఫీ వంటి విధానాలతో పరిశోధించనున్నారు. ప్రస్తుతం వాళ్ల అంచనా ప్రకారం ముందుగా చిన్న డైమండ్‌ పుట్టి, ఆ తరువాత దాని చుట్టూ పెద్ద డైమండ్‌ పుట్టిందన్నారు. ఈ రెండింటిమధ్య ఖాళీ ఏర్పడటమన్నది ఆసక్తికర అంశమన్నారు. దీన్ని అమెరికాలోని జెమొలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కి పంపించనున్నట్లు చెప్పారు. ఈ అరుదైన వజ్రానికి మాట్రియోష్కా డైమండ్‌ అని పేరు పెట్టారు. ఇందుకు కారణం మాట్రియోష్కా నెస్టింగ్‌ డాల్‌ నుంచి ఈ పేరు పుట్టింది. ఈ డాల్‌ మనదేశంలోని కొండపల్లి బొమ్మలాగా తల గాలికి అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. ఈ డైమండ్‌ లోపలి డైమండ్‌ అలా కదులుతుండటంతో ఈ వజ్రానికి ఆ పేరు పెట్టారు.
తాజా అంతర్జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/