భారత రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఇబ్బందులు…

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో ఇబ్బందులు పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆయన పర్యటన ఇబ్బందికరంగా మారింది. అయితే సాంకేతిక సేవలు అందించే సిబ్బంది అలర్ట్‌గా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌ను ముందుగానే గుర్తించడంతో రాంనాథ్ కోవింద్ సేఫ్‌గా బయిట పడ్డారని ఎయిర్ఇండియా టీమ్ తెలిపింది. మూడుదేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి తొలుత ఐస్లాండ్ దేశంలో పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారు. అయితే ఆదివారం స్విట్జర్ల్యాండ్ పర్యటన ముగిశాక స్లోవేకియా వెళ్లాల్సి ఉంది. ఆ క్రమంలో జ్యూరిచ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాంనాథ్ కోవింద్ ఇబ్బంది పడ్డారు. ఎయిర్ ఇండియా విమానంలో గాల్లోకి ఎగిరే సమయంలో ఆఖరి క్షణంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆయన ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా వన్ విమానంలోని రూడర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా టెక్నికల్ సిబ్బంది దాన్ని వెంటనే పసిగట్టారు. లేదంటే గాల్లోకి ఎగిరాక జరగరానిది జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించడంతో ఆ విమానాన్ని వెంటనే నిలిపవేశారు. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం…దాన్ని రద్దు చేయడంతో రాంనాథ్ కోవింద్ దాదాపు 3 గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/international-news/