అమెరికాలో లేడి థెఫ్ట్‌!

ఆసియా ప్రజలు, భారతీయ అమెరికన్ల నివాసాల్లోనే చోరీలు

chaco castro
chaco castro

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో నాలుగేళ్ల నుంచి దొంగల ముఠాను ఏర్పాటు చేసుకుని ఆసియా ప్రజలు, భారతీయ అమెరికన్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను మిచిగాన్‌ న్యాయస్థానం ఎట్టకేలకు బుధవారం ఆమెను దోషిగా తేల్చింది.
చాకో క్యాస్ట్రో అనే మహిళ దొంగల ముఠాను ఏర్పాటు చేసుకుని 2011-14 మధ్య దేశవ్యాప్తంగా భారీ చోరీలకు పాల్పడింది. వారికి భారత అమెరికన్లు, ఆసియా ప్రజలే గురిగా తన ముఠా సభ్యులతో చోరీలకు పాల్పడింది. ఏయే వస్తువులను దొంగిలించాలనేది ముందుగానే జాబితా రూపొందించి, తన ముఠా సభ్యులకు పురమాయించేది, ఆ ప్రాంతాన్ని కూడా ఆమే నిర్ధేశించేదట. వీరు ముసుగు ధరించి, ఆయుధాలను వెంట తీసుకెళ్లి ఇళ్లల్లో వాళ్లను బెదిరించి ,నగదు, ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్‌ సామగ్రిని ఎత్తుకుపోయేవారు అని న్యాయస్థానం తేల్చింది, గ్యాంగ్‌ లీడర్‌తో సహా ముఠా సభ్యులందరికి సెప్టెంబరులో శిక్ష విధించనుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/