సంధి లేదా పోరు దేనికైనా సిద్ధం

Kim Jong Un
Kim Jong Un

సియోల్‌: అణు నిరాయుధీకరణ చర్చలకు అమెరికాకు తాము పెట్టిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో దేశ భద్రత కోసం ‘సంధి లేదా పోరు దేనికైనా సిద్ధమని ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ చెప్పారు. అధికార పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉ.కొరియా అధికార వార్తా సంస్థ కెసిఎన్‌ఎ వెల్లడించింది. చర్చల పునరుద్ధరణ కోసం అమెరికాకు తాము ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో అధికార వర్కర్స్‌ పార్టీ అగ్రనేతలతో భేటీ అయిన కిమ్‌ అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై చర్చించినట్లు కెసిఎన్‌ఎ పేర్కొంది. దేశ సార్వభౌమత్వ పరిరక్షణ, భద్రతకు అవసరమైన సానుకూల, ఎదురు దాడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని కిమ్‌ విదేశీ వ్యవహారాలు, ఆయుధ తయారీ పరిశ్రమలు, సైనిక దళాలకు సూచించారని తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. వీటితో పాటు ప్రభుత్వ నిర్వహణ, ఆర్థికపరమైన అంశాలపై కూడా కిమ్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/