జీఎస్పీ హోదా జూన్‌ 5నుండి తొలగింపు!

Trump
Trump

వాషింగ్టన్‌: భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) తొలగింపు విషయంలో తాను అనుకున్నదే అమలు చేయబోతునన్ను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే భారత్‌కు కల్పించిన జీఎపస్సీ హోదాను జూన్‌ 5 నుండి తొలగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం శ్వేత సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3తో ముగిసింది. అయితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు జీఎస్పీ రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరడంతో దీనిపై తదుపరి ప్రక్రియ ఇప్పటి వరకు ఆగిపోయింది. భారత్‌లో ఎన్నికల ముగియడంతో ట్రంప్‌ తన కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/