మోదికి రష్యా అత్యున్నత పురస్కారం

phutin, modi
phutin, modi


న్యూఢిల్లీ: రష్యా దేశంలో అత్యున్నత పురస్కారం ఐన ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపాజిల్‌’కు ప్రధాని మోది ఎంపికయ్యారు. ఈ అవార్డును ఈ ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోదికి ఇవ్వనున్నట్లు రష్యా రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఈ అవార్డును రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో అసాధారణ సేవలు అందించినందుకు ఇస్తారు.
ప్రధాని మోది అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. గతేడాది దక్షిణకొరియా దేశం సియోల్‌ శాంతి బహుమతి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జాయెద్‌ మెడల్‌కు ప్రధాని మోది ఎంపికయ్యారు. ఈ అవార్డును మోదికి ఇవ్వనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు, ఖలీఫా బిన్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ ప్రకటించారు. భారత్‌, యూఏఈల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో మోది కీలక పాత్ర పోషించారని అందుకే ఆయనను జాయెద్‌ మెడల్‌తో సత్కరించనున్నట్లు అరబ్‌ దేశం వెల్లడించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/