భూటాన్‌కు భారత్‌ అండగా ఉంటుంది

Narendra Modi's Visit To Bhutan
Narendra Modi’s Visit To Bhutan

భూటాన్‌: భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన ముగిసింది. భూటాన్ లో తన పర్యటన సందర్భంగా 10 ఎంఒయులను మోడీ కుదుర్చకున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, రూపే కార్డులను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా దక్షిణాసియా ఉపగ్రహానికి గ్రౌండ్ స్టేషన్ ను మోడీ ప్రారంభించారు. రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ లో మోడీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భూటాన్ కు భారత్ అండగా ఉంటుందని మోడీ ఆ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజదంపతులు మోడీకి విందు ఇచ్చారు. తన పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో మోడీ భారత్ కు బయల్దేరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/