ప్రధాని మోడికి ప్రతిష్టాత్మక అవార్డు

PM Modi
PM Modi

న్యూయార్క్: దేశంలో పరిశుభ్రమైన పరిసరాలు లక్షంగా స్వచ్ఛ భారత్ అభియాన్‌ను చేపట్టినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీని ప్రముఖ బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ” గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు”తో సత్కరించనుంది. ఈ నెల చివరి వారంలో అమెరికా పర్యటన సందర్భంగా మోడీ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించడం కోసం వస్తున్న ప్రధాని మోడీ బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్‌లో కార్పొరేట్ సంస్థల అధిపతులనుద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. తమ దేశంలో లేదా అంతరాతీయంగా ప్రభావం చూపించే కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ లక్షాల సాధనకోసం కృషి చేసే రాజకీయ నాయకుడి సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ ఖగ్లోబల్ గోల్‌కీపర్ అవార్డుగకు గాను 2014లో చేపట్టిన ఖస్వచ్ఛ భారత్ అభియాన్గ కార్యక్రమం ద్వారా 2020 నాటికి దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా తయారు చేయడానికి పట్టుదలతో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నందుకు గాను 2019 సంవత్సరానికి గాను మోడీని ఎంపిక చేసినట్లు ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఈ నెల 24న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/