మోది, ఇమ్రాన్‌ల మధ్య పలకరింపుల్లేవ్‌!

కనీసం ఇద్దరూ మధ్య కుశల ప్రశ్నలు లేవు

modi, imran khan
modi, imran khan

బిష్కెక్‌: కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ వేదికగా షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సిఓ) సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్‌ 13 నుంచి 14 వరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత్‌ ప్రధాని మోది, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ హజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా మోది ఇదే విధంగా అంశాలపై చర్చించుకున్నారు. పాక్‌ ప్రధానితో తప్ప అన్ని దేశాధినేతలతో మోది మాటలు కలిపారు.
సమావేశం అనంతరం కిర్గిస్థాన్‌ అధ్యక్షుడు సూరన్‌బే జీన్‌బెకోవ్‌ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ మోది, ఇమ్రాన్‌ కలిసి కూర్చోలేదని, కనీసం కుశల ప్రశ్నలు కూడా వేసుకోలేదని ఓ ఆంగ్ల మీడియా సమాచారం. దీంతో వీరిద్దరి గురించి అక్కడి నేతల మధ్య చర్చ కూడా వచ్చింది. ఎస్‌సిఓ వేదికగా మోది అన్ని దేశాల నేతలతో సమావేశమవుతున్నారు. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌తో మాత్రం భేటీ లేనట్లేనని తెలుస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/