ట్రంప్‌తో సమావేశమైన మోడి

  • కశ్మీర్ ఉద్రిక్తతను ఎలా తగ్గిస్తారో తెలుసుకోవాలనుకుంటున్న ట్రంప్
modi-trump
modi-trump

బియరిట్స్‌: ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో కీలక సమావేశం ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడితో భారత ప్రధాని మోడి భేటీ అయ్యారు. జీ7 దేశాల్లో కూటమిలో భారత్ లేనప్పటికీ ఫ్రాన్స్ అధినేత ఆహ్వానం మేరకు మోడి ప్రత్యేక అతిథిగా సదస్సులో పాల్గొంటున్నారు. అనంతరం ఇరువురూ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ సంక్షేమానికి భారత్‌అమెరికా కలిసి పనిచేస్తాయని మోడి చెప్పారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. భారత్‌పాక్‌ ఎన్నో ద్వైపాక్షిక అంశాలపై పోరాటం చేయాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, పేదరికం లాంటి ఎన్నో అంశాలపై భారత్‌పాక్‌ యుద్ధం చేయాల్సి ఉందన్నారు. ట్రంప్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంపై భారత్‌, పాక్‌ కలిసి ఓ పరిష్కారానికి వస్తాయని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ విషయం భారత్‌పాక్‌ ద్వైపాక్షిక అంశమని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/