భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు ఈనాటివి కావు

ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

పారిస్‌: భారత ప్రధాని నరేంద్రమోడి మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌ ఫ్రాన్స్‌ సంబంధాలు ఈనాటివి కాదని.. కష్టనష్టాల్లో ఈ రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయిన మోడి అన్నారు. నాలుగేళ్ల క్రితం తాను ఫ్రాన్స్‌ వచ్చినపుడు వేలాదిమంది భారతీయులు తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. నవభారత్‌ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగే కాదు.. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానముందని చెప్పారు. అభివృద్ధి పథంలో భారత్‌ వేగంగా దూసుకెళ్తోందన్నారు. సేవ చేసేందుకు దేశ ప్రజలు తమకు మరోసారి అవకాశమిచ్చారని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/