అమెరికా ఆయుధ తయారీ రంగానికి చైనా షాక్‌

China-America
China-America

వాషింగ్టన్‌: చైనా,అమెరికాల మధ్య వాణజ్య యుద్దం మరింత పెరిగేలా తయారు కానుంది, అయితే అమెరికాకు సరఫరా చేసే అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో కోత విధించాలంటూ చైనా పత్రిక పీపుల్స్‌ డైలీ ఒక కథనం ప్రచురించింది. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రం చేసి చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్న క్రమంలో అమెరికా ఆయుధ తయారీ రంగానికి షాక్‌ ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చైనా సాంకేతిక రంగ సంస్థలకు పరికరాలు, టెక్నాలజీ అందకుండా అమెరికాకు బుద్ధి చెప్పేలా చైనా వద్ద చాలా ఉపాయాలున్నాయని పేర్కొంది. గత కొన్నేళ్లుగా చైనా అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ఈ దేశంలో పర్యావరణ పరిరక్షణ వంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ మైనింగ్‌ పెరిగిపోయింది. ఫలితంగా 2014, 2017లో ప్రపంచంలో ఉత్పత్తి అయిన అరుదైన ఖనిజాల్లో చైనా నుంచి వచ్చిన వాటా 80శాతానికి పైమాటే. ఈ దేశం నుంచి ఏటా 160 మిలియన్‌ డాలర్ల విలువైన ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి.
వీటిల్లో చాలా ఖనిజాలను ఆయుధాల తయారీకి వినియోగిస్తారు. దీంతో వీటిపై ఆంక్షలు తొలుత రక్షణ రంగాన్ని ప్రభావితం చేయనున్నాయి. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/