నేపాల్‌తో భారత్‌ మైత్రీబంధం మరింత పటిష్టం

modi
modi


న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్దదైన రెండుదేశాలమధ్య పైపులైన్‌ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ పైపులైన్‌ భారత్‌,నేపాల్‌దేశాలమధ్య నిర్మించారు. 3500 కోట్ల విలువైన ఆ చమురుపైపులైన్ప్‌ఆజెక్టును ముందు 1996లోనే ప్రతిపాదించారు. ప్రధానిమోడీ నేపాల్‌ను 2014లో పర్యటించిన తర్వాత ఈప్రాజెక్టుకు ప్రాధాన్యం పెకరిగింది. మోడీ నేపాల్‌ప్రధాని కెపిశర్మ ఓలి ఇరువురూ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనచేసారు. నేపాల్‌ప్రధాని గత ఏడాది భారత్‌పరయటన సందర్భంగా హైదరాబాద్‌ హౌస్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. దక్షిణాసియాలో రెండుదేశాలమధ్య నిర్మించిన ఈపైపులైన్‌ రికార్డు కాలంలో పూర్తిచేయగలిగామని, నిర్దిష్ట గడవు కంటేముందే పైపులైన్‌ను అమలుకు తెచ్చామని, ఇందుకు భారత్‌నేపాల్‌ అధికారుల సంయుక్త కార్యాచరణ కీలకంగా ఉందని మోడీప్రశంసించారు. పొరుగుననే ఉన్న నేపాల్‌ అభివృద్ధి భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా స్పష్టంచేసారు. 201లో సంభవించిన భారీ భూకంపం తర్వాత నేపాల్‌పునిర్నిర్మాణానికి భారత్‌ తనవంతు సాయం చేస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/news/national/