చమురు క్షేత్రాలపై దాడులతో పెరిగిన ధరలు!

aramco
aramco


దుబా§్‌ు: సౌదీ అరేబియాలోని ప్రధాన చమురుశుద్ధి కర్మాగారంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి జరిగిన ఆరాంకో చమురు కర్మాగారాలపై మరిన్ని దాడులు జరిగే ప్రమాదమున్నట్లు అంతర్జాతీయ కథనాలు హెచ్చరిస్తున్నాయి. ఆరాంకో ప్లాంట్లపై ఏ క్షణమైనా దాడులు జరగవచ్చని, విదేశీయులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని యెమెన్‌ హవుతి తిరుగుబాటు దారులు మెచ్చరించినట్లు చెప్పారు. తూర్పు సౌదీ ఆరేబియాలోని అబ్‌కైక్‌, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై యెమన్‌ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేశారు. ఇరాన్‌ -సౌదీ అరేబియా దేశాల మధ్య ఉన్న విభేదాలతోనే ఈ దాడులు జరిగాయని అంటున్నారు. తిరుగుబాటు దారులకు ఇరాన్‌ గత కొన్నేళ్లుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. ఇరాన్‌, సౌదీ అరేబియాల మధ్య విభేదాల నేపథ్యంలో హవుతీ , సౌదీల మధ్య కూడా చాలా కాలంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హవుతీలు దాడులకు పాల్పడినారన్నారు. చమురు క్షేత్రాలపై జరిగిన దాడులతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి వల్ల చమురు శుద్ధి ప్రక్రియ భారీగా నిలిచిపోయింది. దాంతో చమురు ధరలు 10శాతాకిపైగా పెరిగాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/