అనసూయమ్మకు ఐక్యరాజ్యసమితి పురస్కారం

Chikapalli Anasuyamma bags UNESCO award
Chikapalli Anasuyamma bags UNESCO award

న్యూయార్క్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలో అంతరించిపోతున్న అడవులను పరిరక్షించిన అనసూయమ్మకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి అవార్డు అందజేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం పస్తాపూర్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌)లో సభ్యురాలైన అనసూయమ్మ..ఝరాసంగం, రాయికోడ్‌, న్యాల్‌కల్‌ మండలాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేసి భారీగా మొక్కలు పెంచారు. ప్రకృతిని కాపాడేందుకు అడవి అంతరించిన చోట్ల మొక్కలు పెంచి అటవీని సృష్టించిన ఆమె సేవలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. అంతర్జాతీయ స్థాయిలో డీడీఎస్‌ సభ్యురాలికి అవార్డు రావడంతో పలువురు అభినందించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/