ఆఫ్ఘనిస్థాన్‌లో దారుణ ఘటన

విమాన ప్రమాదంలో 83 మంది మృతి

Passenger plane crashes in Afghanistan
Passenger plane crashes in Afghanistan

కాబూల్‌: ఇటీవల ఇరాన్ లో విమానం కుప్పకూలిన ఘటన మరువక ముందే ఆఫ్ఘనిస్థాన్ మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ విమానంలో 83 మంది ప్రయాణికులుండడంతో వారు ప్రాణాలతో ఉంటారన్న దానిపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదు. అరియానా ఆఫ్ఘాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ బోయింగ్ విమానం ఘజ్నీ ప్రావిన్స్ లోని సడో ఖేల్ ప్రాంతంలో కుప్పకూలినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో విమాన ప్రమాదంపై సందేహాలు తలెత్తుతున్నాయి. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా? లేక తాలిబాన్ల దాడి ఫలితమా అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/