పారిస్‌లో కార్ల మీద నిషేధం విధించిన ప్రభుత్వం

Paris
Paris

పారిస్‌: యారప్‌ దేశాలు వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రాన్స్‌ దేశంలో గాలి కాలుష్యం కూడా తీవ్రమైంది. అయితే ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి పారిస్‌ ప్రభుత్వం సగం కంటే ఎక్కువ కార్లు రోడ్ల మీద తిరక్కుండా నిషేధం విధించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వాటిలో పాత, తక్కువ సామర్థ్యం ఉన్న కార్లే ఉన్నాయి. పారిస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 60 శాతం కార్లు తిరుగుతాయని, వాటి సంఖ్య 50 లక్షల వరకు ఉండొచ్చని ఏఏఏ డేటా సంస్థ వెల్లడించింది. జనవరి 2006 తరవాత కొనగోలు చేసిన ఎలక్ట్రిక్, హైడ్రోజన్‌, పెట్రోల్ కార్లు, 2011 తరవాత కొనుగోలు చేసిన డీజిల్ కార్లకు మాత్రం పారిస్‌ రోడ్ల మీద తిరగడానికి అనుమతి ఉంది. కాగా ఇంత పెద్ద మొత్తంలో కార్ల మీద నిషేధం విధించడం ఇదే మొదటి సారి అక్కడి అధికారులు వెల్లడించారు.


తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/