ట్రంప్‌కు పనామా అధ్యక్షుడు షాక్‌

Laurentino Cortizo
Laurentino Cortizo

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పనామా నూతన అధ్యక్షుడు లారెంటినో కార్టిజో గట్టి షాక్‌ ఇచ్చారు. మధ్య అమెరికాను తమ సొంత ప్రయోజనాలకు అడ్డాగా మార్చుకునేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ఆయన తిప్పికొట్టారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ఇతర దేశాల వారిని విచారణ పూర్తయ్యే వరకూ పనామాలో ఉంచేందుకు సంబంధించిన ఒప్పందం జరుగబోతుందన్న అమెరికా మీడియా ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది జరగని పని అని, తాము మీకు మూడో రక్షణ దేశం గా ఉండబోమని కార్టిజో కుండబద్దలు కొట్టారు. ఇది ఆచరణయోగ్యం కాదని నేను భావిస్తున్నాను, ఈ సమస్యపై మేం చాలా సృష్టంగా ఉన్నాం. అమెరికా కూడా అదేవిధంగా ఉంటుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ అంశంపై మీడియా ప్రచారానికి అనుగుణంగా అమెరికా జాతీయ భద్రత కార్యదర్శి కెవిన్‌ మెక్‌అలినాస్‌ పనామాలో పర్యటించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/