మా వద్ద చాక్లెట్ సైజులో అణుబాంబులు ఉన్నాయి

Pakistan minister Sheikh Rashid
Pakistan minister Sheikh Rashid

ఇస్లామాబాద్‌: ఆర్టికల్ 370 రద్దు విషయంలో అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టుకోలేక పోయిన పాకిస్థాన్… భారత్ పై యుద్ధానికి సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ, తమ వద్ద 125 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువైన, చాక్లెట్ సైజులో ఉన్న అణుబాంబులు కూడా ఉన్నాయని తెలిపారు. లక్షిత ప్రదేశాలను అవి ధ్వంసం చేయగలవని చెప్పారు. ఇవి వ్యూహాత్మక అణుబాంబులని తెలిపారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడే భారత్ తో పాకిస్థాన్ కు సంబంధాలు తెగిపోయాయని అన్నారు.


తాజా జాతీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/