ఐరాసకు లేఖ రాసిన పాకిస్థాన్‌

కశ్మీర్‌ విభజనపై తక్షణ సమావేశం జరిపించండి

Mahmood Qureshi
Mahmood Qureshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు జొవాన్న రొనెక్కాకు లేఖ రాశారు. జమ్మూకశ్మీర్‌ అంశంపై భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అత్యవసర సమావేశాన్ని జరిపించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)కి లేఖరాసింది. కాగా భారత్‌ తీసుకుంటున్న చర్యల వల్ల అంతర్జాతీయ సమాజంలో శాంతికి విఘాతం కలుగుతోంది. ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాలని కోరుకుంటున్నాం. మా నిగ్రహాన్ని చేతగానితనంగా భారత్‌ భావిస్తోందిగ అని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై 15సభ్యుల కమిటీ ఎలా స్పందిస్తుందో తెలియరాలేదు. అయితే దీనిపై పోలాండ్‌ విదేశీ మంత్రి జాసెక్‌ జాపుటోవిజ్‌ స్పందించారు. పాక్‌ నుంచి ఐరాసకు లేఖ అందిందని, దానిపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/