మసూద్ అజర్ విడుదల

Masood Azhar
Masood Azhar

న్యూఢిల్లీ: కరడుకట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని జమ్మూకశ్మీరులో రద్దు చేసిన దరిమిలా భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఈ చర్యను చేపట్టడం గమనార్హం. ఈ ఏడాది మేలో అజర్‌ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నేందుకే పాక్ అజర్‌ను విడుదల చేసినట్లు భారత్ భావిస్తోంది. సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి చొరబడి దేశంలో దాడులకు పాల్పడేందుకు జైషే మొహమ్మాద్‌కు చెందిన అండర్ వాటర్ వింగ్ కొందరు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు భారతీయ నౌకాదళం ఇటీవలే హెచ్చరించింది. సముద్రం నుంచి దేశంలోకి చొరబడకుండా కోస్టల్ సెక్యూరిటీ అన్ని చర్యలు చేపట్టినట్లు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ కరంబీర్ సింగ్ తెలిపారు.